logo

స్వాతంత్ర్య సమరయోధుడు,సంఘసంస్కర్త, మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

స్వాతంత్ర్య సమరయోధుడు,సంఘసంస్కర్త, మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు శుక్రవారం రోజున కోరుట్ల కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు రావు మాట్లాడుతూ.... బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. రాజ్యాంగ సభలో సభ్యునిగా ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. బడుగు,బలహీన వర్గాల శ్రేయస్సు కోసం తన జీవితం అంకితం చేశారన్నారు. బాబు 1936-1986 మధ్య 50 సంవత్సర్రాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారన్నారు. బాబుజీగా పిలిపించుకున్న ఆయన నడిచిన బాట... అనుసరించాల్సిన ఆదర్శాలు... చూపిన సంస్కరణ మార్గాలు గుర్తు చేసుకుంటూ... ఆయన జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాచకొండ రోజా , కోశాధికారి చిలువేరి రాజశేఖర్ , సాంస్కృతిక కార్యదర్శి పసియోద్దీన్, క్రీడా కార్యదర్శి చింతకింది ప్రేమ్ కుమార్,గ్రంథాలయ కార్యదర్శి సుతారి నవీన్ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గొనె సదానంద నేత, కొంపల్లి సురేష్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లోకిని శరణ్య దీప మరియు సీనియర్ న్యాయవాదులు M V రమణమూర్తి, ఓటరికారి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

14
2143 views